Prayer Book
1 The Sign of the Cross సిలువ గుర్తు
↑ Top
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున. ఆమేన్.
2 The Lord’s Prayer మా తండ్రి ప్రార్థన
↑ Top
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రమగును గాక. నీ రాజ్యము రాగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమిమీదను నెరవేర్చబడును గాక. మా దైనందిన ఆహారము నేడు మాకు అనుగ్రహించుము. మా అప్పులను మేము క్షమించినట్లు మా అప్పులను క్షమించుము. మమ్ములను శోధనలోనికి తీసికొనిపోక దుష్టునుండి విడిపించుము. ఆమేన్.
3 Hail Mary హైల్ మేరీ ప్రార్థన
↑ Top
హైల్ మేరీ, కృపతో నిండినవే, ప్రభువు నీతో ఉన్నాడు. స్త్రీలలో నీవు ధన్యురాలు; నీ గర్భఫలం యేసు ధన్యుడు. పరిశుద్ధ మరియమ్మ, దేవుని తల్లి, మేము పాపులమైన మా కొరకు ఇప్పుడు మరియు మా మరణ సమయమున ప్రార్థించుము. ఆమేన్.
4 Glory Be to the Father మహిమ ప్రార్థన
↑ Top
తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆది లోనెలాగైతే ఇప్పుడు ఎల్లప్పుడును యుగయుగాల వరకు ఉండును గాక. ఆమేన్.
5 The Apostles'' Creed అపొస్తలుల విశ్వాస ప్రకటన
↑ Top
నేను పరలోకమును భూమిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన తండ్రియైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును, మన ప్రభువును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మవలన గర్భములో ఏర్పడి కన్య మరియ నుండి జన్మించెను. పోంతియో పిలాతు కాలమందు బాధపడెను, సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడ్డాడు. మృతులలోనుండి మూడవ దినమున లేచెను. పరలోకమునకు ఎక్కి తండ్రియైన దేవుని కుడిపక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడనుండి బ్రతికియున్నవారిని మరియు మృతులను తీర్పు చేయుటకు వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ కాథలిక సంఘమును, పరిశుద్ధుల సమాజమును, పాపముల క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
6 Anima Christi ఆనిమా క్రిస్టి
↑ Top
Anima Christi ఆనిమా క్రిస్టి
యేసు ఆత్మా,
నన్ను పరిశుద్ధునిగా చేయుము.
యేసు శరీరమా,
నన్ను రక్షించుము.
యేసు రక్తమా,
నన్ను పవిత్ర పరచుము.
యేసు పక్కనుండి ప్రవహించిన జలమా,
నన్ను శుద్ధి చేయుము.
యేసు బాధలారా,
నన్ను బలపరచుము.
మంచి యేసువా,
నన్ను వినుము.
నీ గాయములలో
నన్ను దాచుము.
నీ నుండి
నన్ను వేరుపరచనీయకు.
దుష్ట శత్రువునుండి
నన్ను రక్షించుము.
నా మరణ సమయమున
నన్ను పిలుచుము.
నీ సమీపమునకు రానీయుము.
నీ పరిశుద్ధులతో కూడి
నిన్ను యుగయుగముల పాటు స్తుతించుటకు
ఆమేన్.
Sign of the Cross
పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.
Apostles Creed
పరలోకమును, భూలోకమును సృష్టించిన
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాధుడునైన
యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భవతి అయిన కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పో౦స్యు పిలాతుని అధికారమునకు లోనై, పాటుబడి, స్లీవ మీద
కొట్టబడి, మరణము పొంది, సమాధిలో ఉ౦చబడెను.
పాతాళమునకు దిగి, మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన
సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడనుండి జీవించువారలకును, చనిపోయినవారలకును
తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును
విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరము యొక్క ఉత్ధానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.
Our Father
పరలోకమందు౦డెడు మా యొక్క తండ్రీ!
మీ నామము పూజి౦పబడునుగాక!
మీ రాజ్యము వచ్చునుగాక!
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుబడినవారిని మేము మన్నించునట్లు
మా అప్పులను మీరు మన్ని౦చండి .
మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.
Hail Mary
దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు మా కొరకు
ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్ధించండి. ఆమెన్.
Glory Be
పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ
ఆదిలోవలె ఇప్పుడును, ఎల్లప్పుడును కలుగునుగాక! ఆమెన్.
Oh My Jesus
ఓ నా యేసువా! మా పాపాలు మన్నించండి.
మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి.
ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనవాటిని
మోక్షమునకు తీసికొని పొండి. ఆమెన్.
Hail Holy Queen
Final Prayer
జపమాల
మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వరా! దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను గాక యుండినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్త్రోత్రము గాను ఏబది మూడు పూసల జపము చేయుటకు మహా ఆశగా నున్నాను. ఈ జపము భక్తి తో చేసి పరాకు లేక ముగింప మీ సహయము నియ్యనవధరించండి.
సకల పుణ్యమూలకు విశ్వాసమనేడి పుణ్యము ఆస్థి భారమై యుండుట వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొనుదుము గాక.
(1- పరలోక, 3- మంగళవార్త, 1-త్రిత్వ )
1. సంతోష దేవ రహస్యములు
(సోమ, శనివారములందు చెప్పవలెను)
1) గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురుంచి ధ్యానించుదము గాక
2) దేవమాత పునీత ఎలిజబేతమ్మను సందర్శించుటను గురుంచి ధ్యానించుదము గాక
3) జేసువు పుట్టుకను గురుంచి ధ్యానించుదము గాక
4) బాల జేసువు దేవాలయములో కానుకగా ఒప్పగింపబడుటను గురుంచి ధ్యానించుదము గాక
5) దేవమాత కానకబోయిన బాలజేసును దేవాలయములో కనుగొనుటను గురుంచి ధ్యానించుదము గాక
దుఃఖః దేవ రహస్యములు
(మంగళ, శుక్రవారములందు చెప్పవలెను)
1) జేసు రక్తచెమటను చెమర్చుటను గురుంచి ధ్యానించుదము గాక
2) జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురుంచి ధ్యానించుదము గాక
3) జేసునాథుని తిరుశిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురుంచి ధ్యానించుదము గాక
4) జేసు స్లీవను మోసుకొని పోవుటను గురుంచి ధ్యానించుదము గాక
5) జేసు స్లీవమీద కొట్టబడి మరణము పొందుటను గురుంచి ధ్యానించుదము గాక
మహిమ దేవ రహస్యములు
(బుధ, ఆదివారములందు చెప్పవలెను)
1) జేసు ఉత్తాన మగుటను గురుంచి ధ్యానించుదము గాక
2) జేసు మొక్షారోహణమగుటను గురుంచి ధ్యానించుదము గాక
3) పవిత్రాత్మయైన సర్వేశ్వరుడు అపోస్తులులప మీద వేంచేసి వచ్చుటను గురుంచి ధ్యానించుదము గాక
4) దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురుంచి ధ్యానించుదము గాక
5) దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుటను గురుంచి ధ్యానించుదము గాక
వెలుగు దేవ రహస్యములు
(గురువారములందు చెప్పవలెను)
1) యోర్దాను నదిలో యేసు బాప్తిస్మము పొందుటను గురుంచి ధ్యానించుదము గాక
2) కానా పల్లెలో మొదలైన యేసుని మహిమలు గురుంచి ధ్యానించుదము గాక
3) ప్రభువు దైవ రాజ్యమును ప్రకటించుటను గురుంచి ధ్యానించుదము గాక
4) ప్రభువు దివ్యరూపమును పొందుటను గురుంచి ధ్యానించుదము గాక
5) ప్రభు దివ్యసత్ప్రసాదమును ష్ఠాపించుటను గురుంచి ధ్యానించుదము గాక
ప్రతి దేవరహస్యము పిమ్మట ఈ దిగువ విన్నపమును చెప్పవలెను
ఓ మా యేసువా ! మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగ నరక ఆపాయ స్థితిలో ఉన్న ఆత్మలను, మోక్షమునకు చేర్చండి.
అతిదుతయగు పునీత మిఖయేలా ! దేవదూతయగు పునీత గాబ్రియేలా ! అపొస్తలులైన పునీత రాయప్ప, ఆర్లప్పా, యాగప్ప అనెడు వారలారా, మే మెంత పాపాత్ములముగ నుండినను, మేము వేడుకొను ఈ ఏబది మూడు పూసల జపమును దేవమాత పాదములందు మీ ష్తోత్రములతో నొకటిగా జేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము జూచి ప్రార్థించుచున్నాము. ఆమెన్
కృపా రసముగల మాతా
కృపారసముగల మాతయైయు౦డెడి రాజ్ఞీ! వందనము
మా జీవమా! మా మధురమా! మా శరణమా! వందనము
పరదేశులమై యుండెడు మేము ఏవకు చెందిన బిడ్డలము
మిమ్ము చూచి మొరపెట్టుచున్నాము
ఈ కన్నీటి కనుమయందు ప్రలాపి౦చి ఏడ్చేడు మేము
మిమ్ము చూచి నిట్టూర్పు విడుచుచున్నాము
అందువలన మా కొరకు మనవి చేసెడు తల్లీ!
మీ దయారసముగల కన్నులను మా మీదకు త్రిప్ప నవదరించండి.
ఇదిగాక, ఈ పరదేశము గడచిన తరువాత
ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు యేసునాధుని ప్రత్యక్షమైన
దర్శనమును మాకివ్వ నవదరి౦చ౦డి.
కృపగల తల్లీ! దయారసముగల తల్లీ!
ఓ మధురమైన కన్యమరియమ్మా! మా కొరకు ప్రార్ధించండి. ఆమెన్
దేవమాత ప్రార్థన
స్వామి కృపగా నుండండి
క్రీస్తువా! కృపగా నుండండి
స్వామి కృపగా నుండండి
క్రీస్తువా! మా ప్రార్థన విననవధరించండి
క్రీస్తువా! మా ప్రార్థన ప్రకారము దయచేయండి
పరలోకమందుడెడు పితయైన సర్వేశ్వరా , మా మీద దయగా నుండండి స్వామి
లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వరా
పవిత్రాత్మయైన సర్వేశ్వరా
మహా పరిశుద్ధ ఏక త్రిత్వ సర్వేశ్వరా
పరిశుద్ధ మరియమ్మ,.............................................. మాకొరకు వేడుకొనండి
సర్వేశ్వరుని యొక్క మాతా,
కన్యకల యొక్క పరిశుద్ధ కన్యకా,
క్రీస్తుని యొక్క మాతా,
దేవ వరప్రసాదము యొక్క మాతా,
మహా పరిశుద్ధ మాతా,
మహా విరక్తిగా నుండెడు మాతా,
నిర్మలమైన మాతా,
కన్యశుద్దము చెడని మాతా,
ప్రేమకు తగిన మాతా,
మహాస్తుతికి పాత్రమైన మాతా,
మంచి ఆలోచన యొక్క మాతా,
సృష్టికర్త యొక్క మాతా,
రక్షకుని మాతా,
మహా వివేకము గల కన్యకా,
మహాపూజ్యమైన కన్యకా,
స్తుతింపబడ యోగ్యమైన కన్యకా,
శక్తి గల కన్యకా,
దయ గల కన్యకా,
విశ్వాసము గల కన్యకా,
ధర్మము యొక్క అద్ధమా,
జ్ఞానము యొక్క ఆలయమా,
మా సంతోషము యొక్క కారణమా,
జ్ఞాన పాత్రమా,
మహిమకు తగిన పాత్రమా,
అత్యంత భక్తి యొక్క పాత్రమా,
దేవ రహస్యము గల రోజా పుష్పమా,
దావీదునియొక్క ఉప్పరిగా,,
దంతమయమైన ఉప్పరిగా,
స్వర్ణమయమైన ఆలయమా,
వాగ్దత్తము యొక్క పెట్టే,
మోక్షము యొక్క వాకిలీ,
ఉదయకాల నక్షత్రమా,
వ్యాథి గ్రస్తులకు ఆరోగ్యమా,
పాపాత్ములకు శరణమా,
కష్టపడెడు వారలకు అదరువా,
క్రీస్తువలయొక్క సహాయమా,
సన్మనస్కుల యొక్క రాజ్ఞీ,
పితాపితృల యొక్క రాజ్ఞీ,
దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞీ,
అపోస్తులుల యొక్క రాజ్ఞీ,
వేదసాక్షుల యొక్క రాజ్ఞీ,
స్తుతియుల యొక్క రాజ్ఞీ,
కన్యస్త్రీల యొక్క రాజ్ఞీ,
సకల పునీతుల యొక్క రాజ్ఞీ,
జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞీ,
మోక్షమునకు కోనిపోబడిన రాజ్ఞీ,
పరిశుద్ధ జపమాల రాజ్ఞీ,
కుటుంబము యొక్క రాజ్ఞీ,
సమాధానము యొక్క రాజ్ఞీ,
లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా పాపములను మన్నించండి స్వామి!
లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి!
లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా మీద దయగా నుండండి స్వామి!
యేసు క్రీస్తు దివ్య వాగ్దాత్తములకు మేము ప్రాప్తులమగునట్లు!
సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా! మా కొరకు ప్రార్ధించండి
.
ప్రార్దించుదము
జగద్రక్షకుడైన జేసువా ! మీ స్లీవ క్రింద నిలిచియుండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి యనుగ్రహమును దయచేసి దేవరవార కాలప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలిసికొనినటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండేడు భాగ్యము మాకెప్పటికిని ప్రాప్తింపచేయ నవధరించండి. స్వామి. ఆమెన్
పునీత బెర్నార్డ్ దేవమాతను జూచి వేడుకొనిన జపము
మిక్కిలి నెనరుగల తల్లీ,మీ శరణుగోరి పరిగెత్తి వచ్చి మీ యుపకార సహాయములను బ్రతిమాలి,మీ వేడుకోలు సహాయమును అడిగినవారలయందు ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్టు ఎన్నడును లోకములో వినినది లేదని తలంప నవధరించండి. కన్యకల రాజ్ఞీయైన కన్యకా! కరుణారసముగల తల్లీ! ఇటువంటి నమ్మికచేత ప్రేరేపింపబడి,మీ దివ్య పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చేచు పాపినైనా నేను మీ దయాళుత్వమునకు కాచుకొని, మీ సముఖములో నిలుచుచున్నాను. అవతరించిన వార్తయొక్క తల్లీ! నా విజ్ఞాపనమును త్యజింపక దయపరివై నిన్న విన నవధరించండి.
జన్మపాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మా! పాపులకు శరణమా! ఇదిగో పరుగెత్తివచ్చి, మీ శరణుజొచ్చితిమి.
మా మీద నెనరుగా నుండి. మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. (ఇట్లు మూడు సార్లు చెప్పి 1పర. 1మం. త్రీత్వ. )
దేవమాతకు సమర్పణ
నా యొక్క రాజ్ఞీ నా యొక్క తల్లి! నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుచున్నాను. కాబట్టి నన్ను మీ స్వంతముగా చేసికొని నన్ను కాపాడనవధరించండి. ఆమెన్
జేసు, మరియా, జోజప్పా! నా హృదయమును నా యాత్మను నా జీవితమును, మీకు సమర్పించుచున్నాను
జేసు, మరియా, జోజప్పా! నా కడపటి అవస్థలో నాకు సహాయము చేయండి
జేసు, మరియా, జోజప్పా! మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణము విడుచుదును గాక
9 JAPAMALA Joyful Mysteries జపమాల
↑ Top
1. గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుట
2. దేవమాత పునీత ఎలిజబేతమ్మను సందర్శించుట
3. ఏసు పుట్టుకను గురించి
4. బాలఏసు దేవాలయములో కానుకగా ఒప్పగింపబడుట
5. దేవమాత కానకబోయిన బాలేసును దేవాలయములో కనుగొనుట
Sign of the Cross
పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.
Apostles Creed
పరలోకమును, భూలోకమును సృష్టించిన
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాధుడునైన
యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భవతి అయిన కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పో౦స్యు పిలాతుని అధికారమునకు లోనై, పాటుబడి, స్లీవ మీద
కొట్టబడి, మరణము పొంది, సమాధిలో ఉ౦చబడెను.
పాతాళమునకు దిగి, మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన
సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడనుండి జీవించువారలకును, చనిపోయినవారలకును
తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును
విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరము యొక్క ఉత్ధానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.
Our Father
పరలోకమందు౦డెడు మా యొక్క తండ్రీ!
మీ నామము పూజి౦పబడునుగాక!
మీ రాజ్యము వచ్చునుగాక!
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుబడినవారిని మేము మన్నించునట్లు
మా అప్పులను మీరు మన్ని౦చండి .
మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.
Hail Mary
దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు మా కొరకు
ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్ధించండి. ఆమెన్.
Glory Be
పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ
ఆదిలోవలె ఇప్పుడును, ఎల్లప్పుడును కలుగునుగాక! ఆమెన్.
Oh My Jesus
ఓ నా యేసువా! మా పాపాలు మన్నించండి.
మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి.
ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనవాటిని
మోక్షమునకు తీసికొని పొండి. ఆమెన్.
Hail Holy Queen
Final Prayer
10 JAPAMALA Sorrowful Mysteries జపమాల
↑ Top
1. గెత్సెమనిలో ఆవేదన
2. ఏసును యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుట
3. యూదులు ఏసు ప్రభుని తిరుసిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుట
4. ఏసు స్లీవను మోసుకొని పోవుట
5. ఏసు స్లీవమీద కొట్టబడి మరణము పొందుట
Sign of the Cross
పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.
Apostles Creed
పరలోకమును, భూలోకమును సృష్టించిన
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాధుడునైన
యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భవతి అయిన కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పో౦స్యు పిలాతుని అధికారమునకు లోనై, పాటుబడి, స్లీవ మీద
కొట్టబడి, మరణము పొంది, సమాధిలో ఉ౦చబడెను.
పాతాళమునకు దిగి, మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన
సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడనుండి జీవించువారలకును, చనిపోయినవారలకును
తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును
విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరము యొక్క ఉత్ధానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.
Our Father
పరలోకమందు౦డెడు మా యొక్క తండ్రీ!
మీ నామము పూజి౦పబడునుగాక!
మీ రాజ్యము వచ్చునుగాక!
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుబడినవారిని మేము మన్నించునట్లు
మా అప్పులను మీరు మన్ని౦చండి .
మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.
Hail Mary
దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు మా కొరకు
ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్ధించండి. ఆమెన్.
Glory Be
పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ
ఆదిలోవలె ఇప్పుడును, ఎల్లప్పుడును కలుగునుగాక! ఆమెన్.
Oh My Jesus
ఓ నా యేసువా! మా పాపాలు మన్నించండి.
మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి.
ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనవాటిని
మోక్షమునకు తీసికొని పొండి. ఆమెన్.
Hail Holy Queen
Final Prayer
11 JAPAMALA Glorious Mysteries జపమాల
↑ Top
1. ఏసు ఉత్ధాన మగుట
2. ఏసు మోక్షారోహణమగుట
3. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులులపై వేంచేసి వచ్చుట
4. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుట
5. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుట
Sign of the Cross
పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.
Apostles Creed
పరలోకమును, భూలోకమును సృష్టించిన
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాధుడునైన
యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భవతి అయిన కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పో౦స్యు పిలాతుని అధికారమునకు లోనై, పాటుబడి, స్లీవ మీద
కొట్టబడి, మరణము పొంది, సమాధిలో ఉ౦చబడెను.
పాతాళమునకు దిగి, మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను.
పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన
సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడనుండి జీవించువారలకును, చనిపోయినవారలకును
తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును
విశ్వసించుచున్నాను.
పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీరము యొక్క ఉత్ధానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.
Our Father
పరలోకమందు౦డెడు మా యొక్క తండ్రీ!
మీ నామము పూజి౦పబడునుగాక!
మీ రాజ్యము వచ్చునుగాక!
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుబడినవారిని మేము మన్నించునట్లు
మా అప్పులను మీరు మన్ని౦చండి .
మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.
Hail Mary
దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మా! వందనము.
ఏలినవారు మీతో ఉన్నారు.
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు అగునే
పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా!
పాపాత్ములమై యుండెడు మా కొరకు
ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్ధించండి. ఆమెన్.
Glory Be
పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ
ఆదిలోవలె ఇప్పుడును, ఎల్లప్పుడును కలుగునుగాక! ఆమెన్.
Oh My Jesus
ఓ నా యేసువా! మా పాపాలు మన్నించండి.
మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి.
ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనవాటిని
మోక్షమునకు తీసికొని పొండి. ఆమెన్.
Hail Holy Queen
Final Prayer
12 JAPAMALA Luminous Mysteries జపమాల

13 JAPAMALA Concluding జపమాల
↑ Top
మలయాళం → తెలుగు అనువాదం
జపమాల సమర్పణ
ముఖ్యదూత అయిన పరిశుద్ధ మిఖాయేలు, దేవదూతలైన పరిశుద్ధ గబ్రియేలు, పరిశుద్ధ రఫాయేలు, మహాత్ముడైన పరిశుద్ధ యోసేపు, అపోస్తలులైన పరిశుద్ధ పేతురు, మార్ పౌలో, మార్ యోహాను, మా పితామహుడైన మార్ తోమ్మా, మేము గొప్ప పాపులైనప్పటికీ, మేము జపించిన ఈ ప్రార్థనను మీ స్తోత్రాలతో కలిపి ఒకటిగా చేసి, పరిశుద్ధ దేవమాత పాదాల వద్ద సమర్పించేందుకు మీకు ప్రార్థిస్తున్నాము.
మాతా లిటానీ
ప్రభువా, కరుణించుము
ప్రభువా, కరుణించుము
క్రీస్తా, కరుణించుము
క్రీస్తా, కరుణించుము
ప్రభువా, కరుణించుము
ప్రభువా, కరుణించుము
క్రీస్తా, మా ప్రార్థన వినుము
క్రీస్తా, మా ప్రార్థన వినుము
పరలోక పితా దేవా, మమ్మల్ని అనుగ్రహించుము
లోకరక్షకుడైన కుమారుడైన దేవా “ ”
పరిశుద్ధాత్మ దేవా “ ”
ఏకదైవమైన పవిత్ర త్రిత్వమా “ ”
పరిశుద్ధ మరియమ్మా, మా కోసం ప్రార్థించుము
దేవుని పరిశుద్ధ జననీ “ ”
కన్యలలో కిరీటమైన నిర్మల కన్యకా “ ”
క్రీస్తు తల్లి “ ”
దేవకృపల తల్లి “ ”
అత్యంత నిర్మల తల్లి “ ”
అత్యంత విరక్త తల్లి “ ”
నిర్మల కన్య తల్లి “ ”
కన్యత్వానికి భంగం లేని తల్లి “ ”
ప్రేమకు అర్హమైన తల్లి “ ”
అద్భుతాలకు కారణమైన తల్లి “ ”
సత్బోధన తల్లి “ ”
సృష్టికర్త తల్లి “ ”
రక్షకుని తల్లి “ ”
అత్యంత జ్ఞానవంతమైన కన్యకా “ ”
గౌరవానికి అర్హమైన కన్యకా “ ”
స్తుతికి అర్హమైన కన్యకా “ ”
మహా శక్తివంతమైన కన్యకా “ ”
కరుణామయ కన్యకా “ ”
నిజమైన విశ్వాసమైన కన్యకా “ ”
న్యాయపు అద్దం “ ”
దివ్య జ్ఞాన సింహాసనం “ ”
మా ఆనంద కారణం “ ”
ఆత్మజ్ఞానపూరిత పాత్ర “ ”
గౌరవ పాత్ర “ ”
అద్భుత భక్తి పాత్ర “ ”
దివ్య రహస్యాలతో నిండిన రోజాపుష్పం “ ”
దావీదు కోట “ ”
నిర్మల దంతపు కోట “ ”
బంగారు మందిరం “ ”
వాగ్దాన పేటిక “ ”
పరలోక ద్వారం “ ”
ఉషోదయ నక్షత్రం “ ”
రోగుల ఆరోగ్యం “ ”
పాపుల ఆశ్రయం “ ”
పీడితుల ఆదరణ “ ”
క్రైస్తవుల సహాయం “ ”
దూతల రాణి “ ”
పూర్వ పితామహుల రాణి “ ”
ప్రవక్తల రాణి “ ”
అపోస్తలుల రాణి “ ”
మార్తీరుల రాణి “ ”
కన్యల రాణి “ ”
సమస్త సంతుల రాణి “ ”
నిర్మల గర్భధారణ రాణి “ ”
పరలోకారోహిత రాణి “ ”
పరిశుద్ధ జపమాల రాణి “ ”
కార్మెల్ ఆభరణ రాణి “ ”
శాంతి రాణి “ ”
లోక పాపాలను తీసివేయు దివ్య గొర్రెపిల్లా
ప్రభువా, మా పాపాలను క్షమించుము
లోక పాపాలను తీసివేయు దివ్య గొర్రెపిల్లా
ప్రభువా, మా ప్రార్థన వినుము
లోక పాపాలను తీసివేయు దివ్య గొర్రెపిల్లా
ప్రభువా, మమ్మల్ని అనుగ్రహించుము
సర్వేశ్వరుని పవిత్ర పరిపూర్ణ మాతా, ఇదిగో మేము నీలో ఆశ్రయం కోరుతున్నాము. మా అవసర సమయాలలో మా విన్నపాలను విస్మరించకుము. భాగ్యవతీ, అనుగ్రహిత కన్యామాతా, అన్ని ఆపదల నుండి ఎప్పుడూ మమ్మల్ని కాపాడుము.
యేసుక్రీస్తు వాగ్దానాలకు మేము అర్హులమగుటకు.
సర్వేశ్వరుని పవిత్ర మాతా, మా కోసం ప్రార్థించుము.
ప్రార్థన
ప్రభువా, సంపూర్ణ హృదయంతో సాష్టాంగ నమస్కారముతో పడివున్న ఈ కుటుంబాన్ని కరుణతో చూచి, నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియమ్మ ప్రార్థన ద్వారా అన్ని శత్రువుల ఉపద్రవాల నుండి మమ్మల్ని రక్షించుము. ఈ విన్నపములన్నింటిని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యోగ్యతను బట్టి మాకు అనుగ్రహించుము. ఆమేన్.
పరిశుద్ధ రాణి, కరుణామయ మాతా, స్తుతి!
మా జీవం, మాధుర్యం మరియు ఆశ అయిన నీకు స్తుతి!
హవ్వ సంతతిగా ప్రవాసంలో ఉన్న మేము నీకు మొరపెడుతున్నాము; ఈ కన్నీటి లోయలో నీకు ప్రార్థిస్తున్నాము.
కాబట్టి, మా మధ్యవర్తీ, నీ కరుణామయ దృష్టిని మా వైపు తిప్పుము.
ఈ ప్రవాసం తరువాత నీ గర్భఫలమైన యేసును మాకు చూపుము.
కరుణ, దయ, మాధుర్యంతో నిండిన కన్యామరియమ్మా! ఆమేన్.
యేసుక్రీస్తు వాగ్దానాలకు మమ్మల్ని అర్హులుగా చేయుము.
సర్వేశ్వరుని పవిత్ర మాతా, మా కోసం ప్రార్థించుము.
ప్రార్థన
సర్వశక్తిమంతుడైన నిత్య దేవా, భాగ్యవతీ మరియమ్మ ఆత్మను మరియు శరీరాన్ని పరిశుద్ధాత్మ కృపచే నీ దివ్య పుత్రునికి యోగ్యమైన సింహాసనంగా ముందే నిర్ణయించావు. ఈ దివ్యమాతను స్మరించి ఆనందిస్తున్న మేము, ఆమె శక్తివంతమైన ప్రార్థనల ద్వారా ఈ లోకంలోని అన్ని ఆపదల నుండి మరియు నిత్యమరణం నుండి రక్షించబడేందుకు కృప చేయుము. ఈ విన్నపములన్నింటిని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యోగ్యతను బట్టి మాకు అనుగ్రహించుము. ఆమేన్.